ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డానికి బ‌ద్ధ‌కంగా ఫీల్ అవుతున్నారా? ఆనంద్ మ‌హింద్రా ఈజీ సొల్యూష‌న్

ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డానికి బ‌ద్ధ‌కంగా ఫీల్ అవుతున్నారా? ఆనంద్ మ‌హింద్రా ఈజీ సొల్యూష‌న్

ముంబై: ఎక్స‌ర్‌సైజ్ చేయాలంటే కొంత‌ మంది ఎక్క‌డ‌లేనిబ‌ద్ధ‌కం వ‌చ్చేస్తుంది. ఎక్స‌ర్‌సైజ్ చేయాల‌ని ఉన్నా రేప‌టి నుంచి చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు. ఇంకొంత మంది రోజూ ఎక్స‌ర్‌సైజ్ చేసినా ఆదివారం, సెల‌వు రోజుల్లో మాత్రం రెస్ట్ తీసుకుందామ‌ని అనుకుంటారు. ఇలాంటి వాళ్ల‌కు ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త‌, మ‌హింద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హింద్రా వెరైటీ సొల్యూష‌న్ క‌నిపెట్టారు. ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో క‌ష్ట‌ప‌డకుండా, అంగుళం కూడా క‌ద‌ల‌కుండా ఎక్స‌ర్‌సైజ్ చేసిన ఫీలింగ్ కావాలంటే ఇదిగో సొల్యూష‌న్ అంటూ ఆయ‌న ఒక‌ వీడియోను ట్వీట్ చేశారు. 
“ఆదివారం వ‌స్తే ఎక్స‌ర్‌సైజ్ చేయ‌డానికి మీరు లేజీగా ఫీల్ అవుతుంటారా? అయితే మీ కోసం ప‌రిష్కారం ఉంది. నాలాగే మీరు కూడా ఈ వీడియో క్లిప్‌ను స్టోర్ చేసుకోండి. క‌నీసం రెండు సార్లు చూడండి. పూర్తి చూసేశాక క‌చ్చితంగా మీరు అలిసిపోతారు. నాదీ గ్యారెంటీ. మీ శ‌రీరంలో ప్ర‌తి మ‌జిల్ ఎక్స‌ర్‌సైజ్ చేసిన ఫీల్‌లోకి వ‌చ్చేస్తుంది” అంటూ జిమ్నాస్టిక్స్ వీడియోను ఆనంద్ మ‌హింద్రా ట్వీట్ చేశారు.

ఆనంద్ మ‌హింద్రా ట్వీట్‌కు నెటిజ‌న్ల నుంచి సూప‌ర్ స్పంద‌న వ‌చ్చింది. ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయ‌న ట్వీట్ చేస్తే సాయంత్రం 5 గంట‌ల‌కే ల‌క్షా 20 వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 9 వేల మందికి పైగా లైక్ చేయ‌గా, 1300 మందికి పైగా రీట్వీట్ చేశారు. కామెంట్స్ కూడా ఇట్రెస్టింగ్‌గా వ‌చ్చాయి. ఒక బామ్మ ఎక్స‌ర్‌సైజ్ చేస్తున్న వీడియోను షేర్ చేసి ఇదొక ఇన్‌స్పిరేష‌న్ అంటూ ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు.

“జ‌స్ట్ వాచ్.. డు నాట్ అటెంప్ట్ (ఊరికే చూడండి. కానీ ట్రై చేయొద్దు)” అంటూ హెచ్చ‌రిక‌లా ఫ‌న్నీ కామెంట్ చేశాడు మ‌రో నెటిజ‌న్.

వీళ్లు మ‌నుషులా లేక రోబాలా కండ్లు చూసేది న‌మ్మ‌లేకుండా ఉంది అంటూ మ‌రో నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.